5thcentury | రథోత్సవానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు

5thcentury | రథోత్సవానికి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు

5thcentury | బాపట్ల శ్రీ భావన్నారాయణ స్వామి దేవాలయ వైభవం
చోళుల కాలం నుంచి దేవాలయ అభివృద్ధి
శాసనాలు, దానాలు, సేవల విశిష్టత
క్షేత్రగాధలు మరియు పురాణ ప్రాముఖ్యత
ఆలయ నిర్మాణ వైభవం, శిల్పకళా అందాలు
వైశాఖ బ్రహ్మోత్సవాల ప్రత్యేకత

5thcentury | బాపట్ల బ్యూరో, ఆంధ్రప్రభ ; ‎భావ సౌందర్యాలవిరి భావపురి. కళ సాంస్కృతిక విద్యకేంద్రంగా వెలుగొందుతుంది. భావపురి ఇలవేలుపు, ఆరాధ్యదైవం భావన్నారాయణస్వామి. ఆంధ్రావనిలో వెలనాటి సీమలో కెల్లా అతిప్రాచీనమైన, చారిత్రక ప్రసిద్ధి కలిగి. పురాతత్వశాఖ వారిచే రక్షిత స్థలంగా కూడా గుర్తింపబడిన దేవాలయం శ్రీ భావన్నారాయణ స్వామి దేవాలయం. అత్యంత రమణీయము దర్శనీయము.

క్రీ.శ.5వ శతాబ్ధంలో భావపట్టణ అనే పేరుతో క్రిమికంఠ చోళ చక్రవర్తి ఈ గ్రామాన్ని స్థాపించాడని తెలుస్తున్నది. మే 1 వ తేదీ శ్రీ మత్ సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత శ్రీ క్షీర భావనారాయణ స్వామి రథోత్సవ ఏర్పాట్లకు ఆలయ అధికారులు ప్రత్యేక కసరత్తు ప్రారంభించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి లక్షలాదిమంది భక్తజన సందోహంతో ఆరోజు తిరునాళ్ల మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లను దేవాదాయ శాఖ అధికారులు చేపడుతున్నారు.

5thcentury

చోళ మహారాజు భావన్నారాయణస్వామి దేవాలయమును నిర్మించి చంద్రగిరి వెంకన్నను పూజాదికమును నిర్వహించుటకు నియమించెనని తెలియుచున్నది. మహామండలేశ్వర దత్తము చేసిరి. క్రీ.శ.1043లో శ్రీ వైష్ణవ అర్చక సంప్రదాయం నెలుకొల్పబడినది. కొణిదెన చోళులు, గుంటూరు పల్లవులు, చందవోలు వెలనాటి చోళులు పోషకులుగా దేవస్థాన అభివృద్ధికి తోడ్పడినారు. సంధి విగ్రహా సోమన పెగ్గడ, కామన పెగ్గడ, రాజ్యదక్షమంత్రి, మూలభృత్య, కట్టూరవ, కావలియ మొదలగు అధికారులు మణిమాన్యములతో ప్రభువుకు సేవ చేసికొనిరి.

కొన్ని శాసనముల ద్వారా కన్నిసెట్టి, సమయ సేనాధిపతి, నగర పురుష నీలిసెట్టి అఖండ దీపమునకు తైలాదికములు సమర్పించినారని తెలియుచున్నది. విజయనగర సామ్రాజ్యాధినేత శ్రీ కృష్ణదేవరాయలు కూడా ధనరూప విరాళము నొసంగినారు. కొంతకాలం పరాధీనపాలనలో నుండి వైభవం కోల్పోయిననూ రాజమండ్రికి చెందిన రాజాకాండ్రేగుల జోగి జగన్నాధరావు బహుద్దూర్ గారు దేవాలయమునకు పూర్వ వైభవం ప్రసాదించినారు. క్రీ.శ.1803 ప్రాంతంలో మూలవిరాట్టు పునఃప్రతిష్ట జరిగినది.

5thcentury

అమరావతికి చెందిన వాసిరెడ్డి వెంకట్రాది నాయుడు ధ్వజ స్తంభమును, యడవల్లి వెంకయ్య మహాద్వార గాలిగోపురమును, వింజమూరి వెంకటరావు పంతులు ఆలయప్రాకారమును, శిఖం వెంకట గురవయ్య కీర్తి స్తంభమును నిర్మింపజేసినారు. భావన్నారాయణస్వామి దేవస్థాన ధర్మాదాయమును నిర్వహించుటకుగాను స్థానాధిపతులుగా వ్యవహరించిన వారిలో విష్ణువర్ధన పండితులు, గోకన పండితులు, సుంకనభట్లు మొదలగువారి పేర్లు ఉన్నవి. భావన్నారాయణ బ్రహ్మారాయణులు మధుసూదన, రాజనారాయణ, ఎరపోతు, ఎర్నకొంబ మొదలగువారు కోశాధిపతులుగా వ్యవహరించెడివారు.

శాసనాలద్వారా ఎంతోమంది పరిచారికలు సానులు పురుష నృత్యకళాకారులు కూడా స్వామివారి సేవలో పునీతులైనారని తెలియుచున్నది. ప్రఖ్యాత నర్తకి లకుమాదేవి ఈ క్షేత్రము నుండే అపచితిప్పయ్య శెట్టి ద్వారా కర్పూర వసంతరాయల ఆస్థాన నరక్తిగా ప్రవేశపెట్టబడినది. భావన్నారాయణస్వామి దేవాలయం మహాచారిత్రక నిర్మాణంగాను, రమణీయ క్షేత్రంగాను దర్శనీయ పవిత్ర స్థలంగాను వాసి కెక్కినది. వివిధ శిల్పాకృతులతో అలరాలే గాలిగోపుర మహాద్వారము నుండి ప్రవేశించగానే ఎడమ బాగమున కళ్యాణ మంటపము, ఎదురుగా రెండు ధ్వజ స్తంభములు వాటి పక్కన పాలరాతి శాసనాలు ఉంటాయి.

5thcentury

ఆలయ లోపలి భాగంగా ప్రతిష్టించబడిన మూలవిరాట్ గర్భగుడి చుట్టూ ఆంజనేస్వామి, గరుడాళ్ళారులు, శాంతకేశవస్వామి, పవళింపు సేవామందిరం, రాజ్యలక్ష్మి, అమ్మవారు, విఖనస స్వామి, రంగనాయకస్వామి, గోదాదేవి, సీతారాములు, జ్వాలా నరసింహాస్వామి, భాష్యకారుల మందిరములు ఉంటాయి. ఒకప్పుడు ఇక్కడే ఉండే శివలింగమును విడిగా తీసి సోమేశ్వరాలయం నిర్మించి అందు ప్రతిష్టించినారు. భావన్నారాయణస్వామి దేవస్థానంనకు సంబంధించిన చారిత్రక విశేషములే కాక అనుశృతంగా వస్తున్న క్షేత్రగాధ కూడా ఒకటి ప్రచారంలో ఉన్నది.

బాపట్లకు సమీప గ్రామమైన కొండపాటూరు నుండి బావ, మరదులు ఇద్దరు కట్టెలు కొట్టుకొనుటకు రాగా అందులో బావ ఒక క్షీర వృక్షముపై వేటు వేయగా అందునుండి రక్తము ప్రవహించెను. అది చూసి దైవమాయగా భావించి సృహ కోల్పోయిన బావను రక్షించుకొనుటకు ప్రార్థింపగా బావ తిరిగి సృహలోకి వచ్చెను. బావా అని పిలిస్తే ఓయ్ అని వక్షము నుండి బదులు వచ్చింది కాబట్టి బావపట్ల అనే పేరుకూడా బాపట్ల కు వచ్చినది. అప్పటినుండి బావమరుదులు భక్తిశ్రద్ధలతో స్వామిని ఆరాధించుచూ సేవలు చేసెడివారు.

ఇంతేకాక క్రిమికంఠ చోళ చక్రవర్తి ఆముదాలపల్లి లో విడిది చేయగా వారి పట్టపుటేనుగు మేతకై ఈ ప్రాంతము వచ్చి క్షీరవృ క్షమును తొండముతో తాకగానే తొండము వృక్షమునకు అతుక్కుని ఊడి రాలేదు. ఇది తెలిసికొనిన మహారాజు వచ్చి దైవంను ప్రార్ధించగా తొండము ఊడి వచ్చినది. అక్కడనే స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ గావించి ఆలయ నిర్మాణంను చోళుడు చేపట్టినాడు. వెంకటగిరి సంస్థానములోని చిమ్మిరిబండి కొండ నుండి ఎండకాలం చల్లగాను, చలికాలం వెచ్చగాను ఉండే రాయి తెప్పించి ఆలయ నిర్మాణం కావించినారు. పునాదుల తవ్వకంలో పుట్టలో నుండి నృసింహాస్వామి విగ్రహముబయట పడినది.

విగ్రహాం అక్కడ నుండి కదల కుండుటచే అక్కడనే దానిని ప్రతిష్ఠ చేసినారు. అట్లు వెలసిన నృ సింహాస్వామి దృష్టిచే అక్కడకు ఆరు క్రోసుల దూరంలోని కారంచేడు గ్రామం దగ్ధమవుట గమనించి ఎదురుగా శాంతకేశవస్వామిని ప్రతిష్టించినారు. తరువాత కొండపాటూరు గ్రామంలో జొన్న పాతరనందు రాజ్యలక్ష్మీ అమ్మవారి విగ్రహాము బయల్పడినది. తాను భావన్నారాయణస్వామి దేవేరినని భక్తులకు తెలుపగా…కొండపాటూరు బావమరుదులు.. భావన్నారాయణస్వామి ఆలయంలోని వాయువ్య భాగంలో ఆమెను ప్రతిష్ఠింప జేశారు.

ఇప్పటికి అమ్మవారి పుట్టిలయిన కొండపాటూరు గ్రామం నుండే ప్రతి ఏటా స్వామి కళ్యాణానికి మంగళ ద్రవ్యాలు తీసుకు రావడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ప్రతి ఏటా వైశాఖశుద్ధ సప్తమి నుండి పౌర్ణమి వరకు, స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభోగంగా జరుగుతాయి.దైవదర్శనం చేసుకోవడం, భాష్య కారుల సన్నిధిలో గుంజళ్ళు తీయడం… రథానికి తాడు లాగడం ద్వారా తమ భక్తిప్రపత్తులను తెలియజేస్తారు. శ్రీమత్ సుందరవల్లీ, రాజ్యలక్ష్మీ సమేత భావన్నారాయణస్వామి వారి వైభవం కన్నుల పండువగా జరపటానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

click here to read

click here to read more

Leave a Reply