ఇంటింటి ప్రచారం..

ఇంటింటి ప్రచారం..
హైదరాబాద్, ఆంధ్రప్రభ : జూబ్లీహిల్స్(Jubilee Hills) ఉప ఎన్నికల్లో దివంగత నేత మాగంటి గోపీనాథ్ ఆశయ సాధన కోసం ఆయన సతీమణి, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్(Maganti Sunitha Gopinath)ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో కలిసి ఈ రోజు నియోజకవర్గం పరిధిలోని బోరబండ డివిజన్‌లో ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.


భర్తను కోల్పోయిన దుఃఖాన్ని కూడా దిగమింగుకొని నియోజకవర్గం (Constituency) అభివృద్ధి కోసం కష్టకాలంలో ప్రజల సంక్షేమం కోసం, పార్టీ కోసం ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న మాగంటి సునీత కారు గుర్తు పై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని ప్రతి ఒక్కరిని కలిసి పార్టీ ప్రణాళికల(Party Plans)ను పంచుతూ ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో కూసుకుంట్ల వెంట బీఆర్ఎస్ చౌటుప్పల్ మండల పార్టీ అధ్యక్షుడు గిర్కటి నిరంజన్ గౌడ్(Girkati Niranjan Goud), చౌటుప్పల్ మున్సిపల్ కన్వీనర్ బొమ్మిరెడ్డి వెంకట్ రెడ్డి, విజయ్‌లు ఉన్నారు.
