అండగా.. కూటమి ప్రభుత్వం
బాపట్ల టౌన్, ఆంధ్రప్రభ : మొంథా తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu) హెలికాప్టర్ లో బాపట్ల, కృష్ణ, పల్నాడు, కోనసీమ, ఏలూరు జిల్లాలలో పర్యటిస్తున్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి, సమాచార పౌర సంబంధాల శాఖ, గృహ నిర్మాణ శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి జిల్లాలోని వేమూరు, బాపట్ల, చీరాల(Bapatla, Chirala) నియోజకవర్గాలలో తుఫాను కారణంగా మునిగిపోయిన పంటలను పరిశీలించారు.
నష్టాలను అంచనా వేసి కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని తెలిపారు. పునరావస కేంద్రాలను ఆకస్మిక తనిఖీ(surprise inspection) చేసి ప్రజలకు అందిస్తున్న సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు.

