రాష్ట్ర స్థాయి పోటీలకు రాయపోల్ విద్యార్థులు
రాష్ట్ర స్థాయి పోటీలకు రాయపోల్ విద్యార్థులు
రాయపోల్, ఆంధ్రప్రభ : గజ్వేల్ (Gajwel) లో నిర్వహించిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జోనల్ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ లో రాయపోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. ఇక్కడ ప్రతిభ కనబరిచిన అండర్-14 విద్యార్థులు ఎ.యశ్వంత్, జి.సౌమ్య రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ పోటీలు పెద్దపల్లిలో జరగనున్నాయి. అలాగే సంగారెడ్డిలో జరిగే అండర్ 19 వాలీబాల్ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎ.సంజన ఎంపికైందని పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి తెలిపారు.
