ఛత్తీస్‌గఢ్‌లోని ధామ్‌తారి జిల్లాలో నేడు ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. మరికొందరికి గాయాలయ్యాయి.. ఇక మావోల శిబిరాన్ని డీఆర్‌జీ సైనికులు ధ్వంసం చేశారు. ఖల్లారి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాదగిరి అడవుల్లో 25 నుంచి 30 మంది మావోలు ఉన్నట్లు సమాచారంతో భద్రతా బలగాలు ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. నేపథ్యంలోనే వారు తారసపడటంతో కాల్పులు ప్రారంభమయ్యాయి.. ఆగిన తర్వాత పరిసరాలలో తనిఖీ నిర్వహించగా, ముగ్గురు మావోయిస్ట్ ల మృతదేహాలు కనిపించినట్లు అధికారులు వెల్లడించారు.. కాగా, సోమవారం కూడా ఇదే ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో కూడా ఇద్దరు నక్సల్స్ హతమయ్యారు.
Encounter – చత్తీస్ గడ్ లో ఎన్ కౌంటర్ – ముగ్గురు నక్సల్స్ మృతి..
