దళితుల పట్ల వివక్ష సరికాదు

దళితుల పట్ల వివక్ష సరికాదు

రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్


హుస్నాబాద్, అక్టోబర్ 15(ఆంధ్రప్రభ) : న్యాయం కోసం ఒక ఐఏఎస్ అధికారిణి (IAS officer) తన భర్త పూరన్ కుమార్ ఐపీఎస్ అధికారి శవంతో దీక్ష చేస్తున్నా కేంద్రంలోని బీజేపీ పాలకులకు చీమకుట్టినట్టు లేదని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) విమర్శించారు.

బుధవారం రోజున హుస్నాబాద్ (Husnabad) పట్టణంలోని తిరుమల గార్డెన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… హర్యానా రాష్ట్రానికి చెందిన ఐపీఎస్ అధికారి ఉన్నతాధికారుల వేధింపులపై 8 పేజీల లేఖ రాసి ఈనెల 7వ తేదీన తన ఇంటిలో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారని, దేశంలో ఐపీఎస్, ఐఏఎస్ అధికారులకు సైతం రక్షణ లేకుండా పోయిందన్నారు. వారం రోజులుగా శవాన్ని దహనం చేయకుండా న్యాయం చేయాలని పూరన్ కుమార్ భార్య నిరసన వ్యక్తం ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్న ఫలితం లేకుండా పోయిందన్నారు. పూరణ్ కుమార్ హైదరాబాద్ వాసి కావడం దళిత కుటుంబంలో పుట్టి ఐపీఎస్ స్థాయికి ఎదిగారన్నారు.