బాపట్లలో 250 మందికి శిక్షణ

బాపట్లలో 250 మందికి శిక్షణ
బాపట్ల బ్యూరో, ఆంధ్రప్రభ : విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే భాధ్యత ఉపాధ్యాయులు(Teachers) లపై ఉందని, ప్రభుత్వం అందిస్తున్నశిక్షణ ను అవగాహన చేసుకుని భవిష్యత్తులో ఉత్తమ ఉపాధ్యాయులు గా ఎదగాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వాసుదేవ వినోద్ కుమార్(District Collector Dr. Vasudeva Vinod Kumar) అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీ(D.Sc)లో నూతనంగా ఎంపికైన ఉపాద్యాయులు ల శిక్షణ తరగతులను శుక్రవారం బాపట్ల ఫార్మాసి కాలేజీ లో ఆయన ప్రారంభించారు.
జోన్ 3 పరిధిలోని ఉమ్మడి గుంటూరు కృష్ణా, ప్రకాశం(Krishna, Prakasam) జిల్లాలో పరిధిలో ఎంపికైన ఉపాధ్యాయులకు బాపట్ల, చీరాల, ఒంగోలు(Ongole) ప్రాంతాలలో శిక్షణ తరగతులు 8 రోజులపాటు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం(Purushottam) తెలిపారు.
బాపట్లబాపట్ల ఫార్మసీ కళాశాలలో 250 మంది వివిధ విభాగాలకు చెందిన ఉపాధ్యాయులు శిక్షణ తరగతుల్లో పాల్గొన్నారు. వీరందరికీ ఆడియో, వీడియో విజువల్స్(Video Visuals) ద్వారా రిసోర్స్ పర్సన్స్ వివిధ అంశాలపై శిక్షణ అందిస్తున్నారు. శిక్షణకు సంబంధించిన పుస్తకాలను అందిస్తున్నారు. శిక్షణ సంస్థ నిర్వాహకులు అనంత నగేష్, జిల్లా అధికారులు శిక్షణా తరగతులను పర్యవేక్షిస్తున్నారు.
