‘ది ప్యార‌డైజ్‌’లో మోహ‌న్ బాబు

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న మూవీ ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో ఈ పీరియాడిక్ సినిమా రాబోతోంది. ‘ది పారడైజ్’ మూవీలో సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి.

ఇటీవల మంచు లక్ష్మి ఈ విషయాన్ని కన్ఫార్మ్ చేసింది. ఈ క్రమంలో శనివారం ఉదయం మోహన్ బాబు ఈ సినిమాలో నటిస్తున్నారని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. శికంజా మాలిక్ అనే పాత్రలో ఆయ‌న నటిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు.

Leave a Reply