నాడు దసరా అంటే మైసూర్….

  • నేడు దసరా అంటే విజయవాడ…
  • జాతీయస్థాయిలో గుర్తింపు పొందుతున్న ఉత్సవం…
  • అన్ని జిల్లాల్లోనూ ఇదే కొనసాగాలి…
  • టూరిజన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తాం…
  • అసెంబ్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు….

ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : ఒకప్పుడు దసరా అంటే కలకత్తా మైసూరు మాత్రమే గుర్తుకు వచ్చేదని కానీ నేడు దసరా అంటే విజయవాడ గుర్తుకు వచ్చేలా అత్యంత వైభవంగా విజయవాడ ఉత్సవ్ జరుగుతోందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని పండగలు అత్యంత వైభవంగా, ఆహ్లాదకర సంతోష వాతావరణంలో అందరూ జరుపుకుంటున్నారని తెలిపారు.

అసెంబ్లీ సమావేశాల్లో శుక్రవారం టూరిజం పై జరిగిన చర్చ కార్యక్రమంలో దసరా, విజయవాడ ఉత్సవ్ నిర్వహణ పట్ల ఆయన ప్రశంసల జల్లు కురిపించారు. నాడు దసరా అంటే మైసూరు గుర్తుకు వచ్చేదని కానీ నేడు విజయవాడ గుర్తుకు వచ్చేలా ఉత్సవ్ ను నిర్వాహకులు నిర్వహించడం అభినందనీయమన్నారు.

విజయవాడ ఉత్సవ్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందన్న ఆయన బిగ్ గేమ్ చేంజర్ గా విజయవాడ ఉత్సవ్ నిలిచిందన్నారు. కూటమి ప్రభుత్వం టూరిజనుని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుందని విజయవాడ ఉత్సవ్ తీరులో అందరూ ఎమ్మెల్యేలు వారి జిల్లాలో నిర్వహించే విధంగా చొరవ తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. అందరినీ మెప్పిస్తున్న విజయవాడ ఉత్సవ్ ను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న నిర్వాహకులకు చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.