తెల్లవారు జాము నుంచే…

సైదాపూర్, ఆంధ్రప్రభ : రైతులను యూరియా(Urea) కష్టాలు ఇంకా వదలడం లేదు. సాగుకు అవసరమైన యూరియా కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కరీంనగర్(Karimnagar) జిల్లా సైదాపూర్(Saidapur) మండలం వెన్నంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముందు సోమవారం(Monday) వేకువజాము నుంచే యూరియా కోసం రైతులు(Farmers) ఎదురుచూస్తున్నారు. యూరియా ఎప్పుడు వస్తుందోనని ఎదురుచూస్తున్నారు.
