తప్పిన పెను ప్రమాదం

- విశాఖ హెచ్ పీసీఎల్ లో భారీ విస్ఫోటనం
- భయంతో కార్మికులు ఉరుకులు పరుగులు
( ఆంధ్రప్రభ. విశాఖపట్నం): విశాఖపట్పం(Visakhapatnam) ఉలిక్కిపడింది. సిథియాలో భారీ అగ్నికీలలు ఎగసి పడుతున్నాయి. ఈ ఘటనతో.. విశాఖ జనం ఒక్కసారి ఆందోళనకు గురయ్యారు. అసలు ఏమి జరిగిందంటే, విశాఖపట్పం సింథియా(Cynthia)లోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్(Hindustan Petroleum Corporation)లో శుక్రవారం ఉదయం భారీ పేలుడు కకావికలం చేసింది. (హెచ్పీసీఎల్)లో విస్తరణ ప్రాంతంలో ఓ పైపు పగిలి గ్యాస్ లీకైంది. అక్కడ పనిచేస్తున్న కార్మికులు భయంతో ఉరుకులు పరుగులు పెట్టారు. రఫ్ కంపెనీ పంపింగ్ మిషన్(Rough Company Pumping Machine) సమీపంలోని పైపు లీక్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని హెచ్పీసీఎల్ పీఆర్ విభాగం తెలిపింది.
ప్రమాద స్థలి నుంచి కార్మికుల( workers)ను బయటకు తరలించారు. ప్రమాద స్థలిని పునరుద్ధరిస్తున్నారు. పెనుప్రమాదం తప్పిందని .. ఎలాంటి ప్రాణహాని జరగలేదని హెచ్పీసీఎల్ పీఆర్ విభాగం ప్రకటించింది. పగిలిన పైపునకు మరమ్మతులు చేపట్టినట్టు స్పష్టం చేసింది.
