AP | కుప్పంలో చంద్రబాబు ఇల్లు రెడీ…

కుప్పం, ఆంధ్రప్రభ బ్యూరో (రాయలసీమ) : కుప్పంలో ముక్య‌మంత్రి చంద్రబాబు నాయుడు సొంత ఇల్లు సిద్ధంగా అయింది. 1989 – 2024 వరకు వరుసగా ఎన్నికల్లో గెలిచి నాలుగోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు, కుప్పాన్ని తెలుగుదేశం పార్టీకి కంచు కోటగా మార్చారు.

వరుసగా ఎన్నికల్లో ఆత్మవిశ్వాసంతో గెలుస్తున్న చంద్రబాబు.. కుప్పం ప్రజలకు దగ్గరగా ఉండి తన నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని నిశ్చయించుకుని సొంత ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించుకున్నారు.

శాంతిపురం మండలం శివపురం సమీపంలో 2022లో కుప్పం-పలమనేరు జాతీయ రహదారి పక్కన దాదాపు ఒక ఎకరం భూమిని కొనుగోలు చేసి ఇంటి నిర్మాణం ప్రారంభించారు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత, ఇంటి నిర్మాణం పూర్తి కావడంతో… గృహ ప్రవేశానికి సిద్ధమయ్యారు.

నివాసం మాత్రమే కాకుండా పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన సమావేశాలు కూడా నిర్వహించడానికి వీలుగా అన్ని సౌకర్యాలతో ఇంటి నిర్మాణం జరిగింది. ఈ నెల 25న చంద్రబాబు నాయుడు తన కుటుంబంతో కలిసి గృహప్రవేశం చేస్తారని పార్టీ వర్గాలు ప్రకటించాయి.

Leave a Reply