IPL 2026 | జైపూర్‌లో రాజస్థాన్-లక్నో హోరాహోరీ సమరం

IPL 2026 | జైపూర్‌లో రాజస్థాన్-లక్నో హోరాహోరీ సమరం

  • రిషబ్ పంత్ vs రియాన్ పరాగ్.. ఎవరిది పైచేయి?

IPL 2026 | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో 64వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు నేడు (మే 19) జైపూర్‌లోని సవాయి మాన్‌సింగ్ స్టేడియం వేదికగా తలపడనున్నాయి. ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే రాజస్థాన్‌కు ఈ మ్యాచ్‌లో గెలుపు తప్పనిసరి కాగా.. ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన లక్నో గౌరవప్రద ముగింపు కోసం బరిలోకి దిగుతోంది.

రాజస్థాన్‌కు డూ ఆర్ డై మ్యాచ్…
ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ 12 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ప్లేఆఫ్స్ అవకాశాలను నిలబెట్టుకోవాలంటే మిగిలిన మ్యాచ్‌ల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో స్వదేశీ ప్రేక్షకుల మద్దతుతో రాజస్థాన్ పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది.

ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నప్పటికీ…
ఇక లక్నో సూపర్ జెయింట్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్నప్పటికీ.. ప్రత్యర్థులకు షాక్ ఇవ్వాలనే లక్ష్యంతో మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. కెప్టెన్ రిషబ్ పంత్ తో పాటు నికోలస్ పూరన్, మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్ వంటి స్టార్ బ్యాటర్లు జట్టుకు ప్రధాన బలం కానున్నారు.

జైపూర్ పిచ్ బ్యాటర్లకు స్వర్గధామం…

సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభంలో పేసర్లకు కొంత సహకారం లభించినప్పటికీ.. మ్యాచ్ సాగేకొద్దీ స్పిన్నర్లు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశముండటంతో అభిమానులు రన్‌ఫీస్ట్‌ను ఆశిస్తున్నారు.

హెడ్ టు హెడ్‌లో రాజస్థాన్ ఆధిక్యం..

ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన 6 మ్యాచ్‌ల్లో రాజస్థాన్ రాయల్స్ నాలుగు విజయాలు సాధించగా.. లక్నో కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. ఈ సీజన్‌లో జరిగిన గత మ్యాచ్‌లో కూడా రాజస్థాన్ 40 పరుగుల తేడాతో లక్నోను చిత్తు చేసింది. దీంతో మానసిక ఆధిక్యం కూడా రాజస్థాన్ వైపే కనిపిస్తోంది.

మ్యాచ్ వివరాలు
వేదిక: సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం, జైపూర్
సమయం: రాత్రి 7:30 గంటలకు
మ్యాచ్: రాజస్థాన్ రాయల్స్ vs లక్నో సూపర్ జెయింట్స్

Leave a Reply