కారును ఢీకొట్టిన లారీ…

హైదరాబాద్ : ఔటర్ రింగ్ రోడ్డు (Outer Ring Road) పై మరోసారి రోడ్డు ప్రమాదం విషాదం సృష్టించింది. గత అర్థరాత్రి జరిగిన ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఆదిబట్ల సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై అర్థరాత్రి 2 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం (Serious road accident) జరిగింది. రావిర్యాల ఎగ్జిట్-13 నుంచి బొంగ్లూర్ ఎగ్జిట్-12 వైపు వెళ్తున్న సమయంలో రోడ్డుపై ఆగి ఉన్న కారును ఒక లారీ వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమైంది.

ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా (One died), మరో ఐదుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఓఆర్‌ఆర్‌ సిబ్బంది అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.