Bhupalpalli | ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తా.. ఎమ్మెల్యే గండ్ర

ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : భూపాలపల్లి (Bhupalpalli) నియోజకవర్గంలోని అన్ని ఆలయాలను సీజీఎఫ్ నిధులతో అభివృద్ధి చేస్తామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు (Gandra Satyanarayana Rao) అన్నారు. శుక్రవారం భూపాలపల్లి మండలం ఆజంనగర్, గొల్లబుద్దారం గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు.

ఆజంనగర్ గ్రామంలో రూ.10లక్షలతో శ్రీ శివ కేశవస్వామి దేవాలయంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం గొల్లబుద్దారంలో రూ.50లక్షలతో శ్రీ రామాలయంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే (MLA) గొల్లబుద్దారంలో మాట్లాడుతూ.. దేవాలయాల అభివృద్ధి (temples Development)కి ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నియోజకవర్గంలో అన్ని ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు. భూపాలపల్లి నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పనులను చూసి ఓర్వలేకనే మాజీ ఎమ్మెల్యే తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం రామాలయంలో ఎమ్మెల్యే మొక్కను నాటి నీరు పోశారు.

Leave a Reply