ఊర్కొండలో గొంతు కోసుకొని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

ఊర్కొండ (ఆంధ్రప్రభ): నాగర్‌కర్నూల్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం ఊర్కొండ మండల కేంద్రంలో ఓ వ్యక్తి గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించిన ఘటన కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని రోడ్డు పక్కన గుర్తుతెలియని వ్యక్తి తీవ్ర రక్తస్రావంతో పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనకు గల కారణాలు, వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.