చెన్నూరులో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా
చెన్నూర్ ఆంధ్రప్రభ :మంచిర్యాల జిల్లాచెన్నూరు నియోజకవర్గంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను శనివారం అధికారులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, ఉద్యోగులు, వివిధ కార్మిక సంఘాల నాయకులు జాతీయ జెండాను ఎగురవేసి ఘనంగా జరుపుకున్నారు. స్థానిక మున్సిఫ్ కోర్టులో జడ్జి పర్వతపు రవి, పోలీస్ స్టేషన్ లో సీఐ బన్సీలాల్, మున్సిపల్ కార్యాలయంలో చెర్ పర్సన్ పెద్దింటి పద్మ శ్రీనివాస్, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ మోహన్ లు జాతీయజెండా ను ఆవిష్కరించాగా, క్యాంప్ కార్యాలయం లో కౌన్సిలర్ మంత్రి లక్ష్మణ్,అంబేద్కర్ చౌక్ లో అంబేద్కర్ సంఘం అధ్యక్షులు తగరం వెంకటి,జ్యోతి బాపురావ్ పూలే విగ్రహం వద్ద బిజెపి చెన్నూర్ నియోజకవర్గ ఇంచార్జ్ దుర్గం అశోక్, సిపిఐ కార్యాలయంలో సిపిఐ మండల కార్యదర్శి నేన్నెల సమ్మయ్య లు, ప్రభుత్వ పాఠశాల, లాళాశాలల్లో ఆయా ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాల్ జెండాలు ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు.
