దేశం సుభిక్షంగా ఉండేందుకు సర్వదేవతా హోమం

శివనగర్‌ రామాలయంలో వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛారణల మధ్య హోమం

కరీమాబాద్, ఆంధ్రప్రభ : ఆషాఢ మాసం పూర్తయిన సందర్భంగా గ్రేటర్‌ వరంగల్‌ శివనగర్‌లోని శ్రీ సీతారామచంద్ర స్వామి దివ్యక్షేత్రంలో బుధవారం సర్వదేవతా హోమం నిర్వహించారు.

ఉదయం 9.30 గంటలకు వేద బ్రాహ్మణుల మంత్రోచ్ఛారణల మధ్య సర్వదేవతా హోమం, పూర్ణాహుతి, లక్ష పుష్పార్చన కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం లలితా పారాయణం, కుంకుమార్చనలు చేపట్టారు.

భక్తులు హోమం, లలితా పారాయణంలో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. పారాయణం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.

కార్యక్రమంలో వేద బ్రాహ్మణులు బండారు ప్రసాద్‌ శర్మ, బండారు చంద్ర ప్రసాద్‌ శర్మ, బండారు జయశంకర్‌ శర్మ, శ్రీ సీతారామచంద్ర స్వామి ట్రస్ట్‌ అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.