నిద్రిస్తున్న వ్యక్తి దారుణ హత్య
గుర్తు తెలియని దుండగుల ఘాతుకం.. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు
పల్నాడు జిల్లా (దుర్గి, మాచర్ల), ఆంధ్రప్రభ: పల్నాడు జిల్లా దుర్గి మండలంలోని ఓబులేశునిపల్లె ఎస్సీ కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంటి వద్ద నిద్రిస్తున్న కొమ్ము ఇమ్మానుయేల్ (35)ను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు.
సమాచారం అందుకున్న ఎస్సై గోపాల్, సీఐ భాస్కర్, డీఎస్పీ ఉమా మహేశ్వరరావు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలు తెలియాల్సి ఉంది.
