హైదరాబాద్ : కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ నేడు తెలంగాణ లో పర్యటించనున్నారు. స్థానిక కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి రాష్ట్రంలో 5 వేల 4 వందల కోట్ల రూపాయల ఖర్చుతో చేపట్టిన 26 ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలను గడ్కరీ చేయనున్నారు.
ఉదయం 9 గంటలకు నాగ్ పూర్ ఎయిర్ పోర్టు నుంచి హెలికాఫ్టర్ లో సిర్పూర్ కాగజ్ నగర్ కు బయలుదేరుతారు. ఉదయం 10.15కి కాగజ్ నగర్ చేరుకొని 10.30 నుంచి 11.30 వరకు జాతీయ రహదారుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 11.45 కు కాగజ్ నగర్ నుంచి బయలుదేరి హైదరాబాద్ నగర శివారులోని కన్హా శాంతివనంకు మధ్యాహ్నం ఒంటిగంటకు చేరుకుంటారు. మధ్యాహ్నం 3.30 వరకు కన్హా శాంతివనం విజిట్ చేసి 3.50 కి బీహెచ్ఈల్ ఇక్రిశాట్ కు చేరుకుంటారు.
సాయంత్రం 4 గంటలకు బీహెచ్ఈఎల్ వద్ద నిర్మించిన ఫ్లై ఓవర్ సందర్శించి ప్రారంభిస్తారు. సాయంత్రం 4.30కి అక్కడ నుంచి బయలుదేరి బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి సాయంత్రం 5 గంటలకు అంబర్ పేట్ ఫ్లై ఓవర్ చేరుకొని విజిట్ చేస్తారు. సాయంత్రం 5.30 కి అంబర్ పేట్ ఫ్లై ఓవర్ ప్రారంభిస్తారు. సాయంత్రం 6 గంటలకు అంబర్ పేట మున్సిపల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు.
వర్చువల్ గా పలు జాతీయ రహదారులను ప్రారంభించి జాతికి అంకితం చేయడంతో పాటు మరికొన్నింటికి శంకుస్థాపన చేస్తారు. తిరిగి రాత్రి 7 గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకొని ఢిల్లీ బయలుదేరి వెళ్తారు.
ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ వద్ద కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ 3 వేల 694 కోట్ల రూపాయల 5 ప్రాజెక్టులను ప్రారంభిస్తారు.నిర్మల్ – ఖానాపూర్ మధ్య 17.79 కిలో మీటర్ల మేర రోడ్డు వెడల్పు పనులు పూర్తిమంచిర్యాల్-రేపల్లెవాడ మధ్యలో 42 కి.మీ. మేర రూ. 2001 కోట్లతో 4 లేనింగ్ పనులు పూర్తిరేపల్లె నుంచి మహారాష్ట్ర సరిహద్దు వరకు 52.6 కి.మీ మేర రూ. 1,525 కోట్లతో 4 లేన్ల రోడ్ ప్రారంభోత్సవంనాగ్ పూర్-హైదరాబాద్ సెక్షన్ లో కడ్తాల్ వద్ద రూ. 23.54 కోట్లతో 6 లేన్ అండర్ పాస్4వ నెంబర్ జాతీయ రహదారిపై నాగ్ పూర్-హైదరాబాద్ సెక్షన్ లో సర్వీస్ రోడ్లు, జంక్షన్ల మార్పు పూర్తి
సాయంత్ర హైదరాబాద్ వచ్చాక ప్రారంభించే ప్రాజెక్టులు
ఇవే.202వ నెంబరు జాతీయ రహదారిపై హైదరాబాద్ లోని అంబర్ పేట 6 నం. జంక్షన్ వద్ద.. 1.47 కిలోమీటర్ల మేర రూ. 415 కోట్లతో నిర్మించిన ఫ్లైఓవర్ కు ప్రారంభోత్సవం44వ నెంబరు జాతీయ రహదారిపై నాగ్ పూర్-హైదరాబాద్ సెక్షన్ లో 1. ఆరాంఘర్ – శంషాబాద్ మధ్యలో 10 కిలోమీటర్ల మేర 6 లేనింగ్ కు భూమిపూజ44 వ నెంబరు జాతీయ రహదారిపై నాగ్ పూర్ – హైదరాబాద్ సెక్షన్ లో మెదక్ జిల్లా రెడ్డిపల్లి జంక్షన్ వద్ద.. 6లేన్ అండర్ పాస్, సర్వీస్ రోడ్డును ప్రారంభోత్సవం44 వ నెంబరు జాతీయ రహదారిపై నాగ్పూర్ – హైదరాబాద్ సెక్షన్లో మెదక్ జిల్లా జాప్తిశివనూర్ గ్రామం వద్ద నిర్మించిన అండర్ పాస్, సర్వీస్ రోడ్డు ప్రారంభోత్సవం44 వ నెంబరు జాతీయ రహదారిపై నాగ్పూర్ – హైదరాబాద్ సెక్షన్లో మెదక్ జిల్లా.. గోల్డెన్ ధాబా Y జంక్షన్ వద్ద 6లేన్ అండర్ పాస్ ప్రారంభోత్సవం44 వ నెంబరు జాతీయ రహదారి పై నాగ్పూర్ – హైదరాబాద్ సెక్షన్లో కామారెడ్డి జిల్లా.. టెక్రియాల్, పొందుర్తి X రోడ్స్ వద్ద.. అండర్ పాస్ పనులు పూర్తయ్యాయి. వీటికి కూడా ప్రారంభోత్సవాలు44 వ నెంబరు జాతీయ రహదారిపై నాగ్పూర్ – హైదరాబాద్ సెక్షన్ కామారెడ్డి జిల్లా.. పద్మాజివాడ జంక్షన్ వద్ద అండర్ పాస్, స్లిప్ రోడ్డుకు ప్రారంభోత్సవం163 నెంబరు జాతీయ రహదారిపై.. హైదరాబాద్ – వరంగల్ సెక్షన్ లో.. ఆలేరు-జీడికల్ X రోడ్స్ వద్ద.. 6లేన్ అండర్ పాస్ ప్రారంభోత్సవం9. 65వ నెంబరు జాతీయ రహదారిపై హైదరాబాద్ లోని BHEL జంక్షన్ వద్ద రూ.172.56 కోట్లతో నిర్మించిన ఫ్లైఓవర్ కు ప్రారంభోత్సవంమరో 657 కోట్ల రూపాయల విలువైన 21 కిలో మీటర్ల అభివృద్ధి గల 7 ప్రాజెక్టలకు వర్చువల్ గా నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేయనున్నారు.