Online Portal Payment | విద్యార్థుల ఖాతాల్లో అనధికార లాగిన్లు గుర్తింపు

Online Portal Payment | విద్యార్థుల ఖాతాల్లో అనధికార లాగిన్లు గుర్తింపు
Online Portal Payment | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : సీబీఎస్ఈ రీవాల్యుయేషన్ ప్రక్రియలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రీవాల్యుయేషన్ కోసం ఉపయోగిస్తున్న ఆన్లైన్ పోర్టల్ పేమెంట్ వ్యవస్థపై సైబర్ దాడి జరిగినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. దాదాపు 50 మంది విద్యార్థుల లాగిన్ వివరాలను ఉపయోగించి పోర్టల్‌లోకి అనధికారికంగా ప్రవేశించినట్లు గుర్తించారు. ఈ ఘటన కారణంగా రీవాల్యుయేషన్ దరఖాస్తు ప్రక్రియలో అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. పేమెంట్ పోర్టల్‌లో చెల్లించాల్సిన ఫీజు కంటే అధిక మొత్తాలు కనిపిస్తున్నాయని విద్యార్థులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
సైబర్ దాడి విషయాన్ని గుర్తించిన అధికారులు వెంటనే సాంకేతిక బృందాలను అప్రమత్తం చేశారు. ఐఐటీ మద్రాస్, ఐఐటీ కాన్పూర్‌కు చెందిన నిపుణులు సమస్యను విశ్లేషిస్తూ పోర్టల్‌ను సాధారణ స్థితికి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు. విద్యార్థుల డేటా భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ, ఘటనపై సమగ్ర విచారణ కొనసాగుతోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన సవరణలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
