శివాజీనగర్‌లో బోర్, విద్యుత్ లైన్ ప్రారంభం
200 మీటర్ల విద్యుత్ లైన్, 900 అడుగుల బోర్ మోటార్ ఏర్పాటు
తాగునీటి సమస్య లేకుండా మెరుగైన వసతులు కల్పిస్తాం
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సహకారంతో యల్లగిరి గ్రామపంచాయతీ పరిధిలోని శివాజీనగర్ కాలనీలో 200 మీటర్ల విద్యుత్ లైన్‌తో పాటు 900 అడుగుల బోర్ మోటార్‌ను సర్పంచ్ రిక్కల మహేందర్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో తాగునీటి ఎద్దడి లేకుండా మెరుగైన వసతులు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి, గ్రామ అవసరాల కోసం తన బోర్ బావిని అందించిన టేకుల దామోదర్‌రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి పబ్బు రాజుగౌడ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కందకట్ల సురేందర్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి బ్రాహ్మణి, వార్డు సభ్యులు మౌనిక, సంతోష, శివశంకర్, పూజ, మల్లేష్, సందీప్, ఇబ్రహీం, స్థానిక నాయకులు జంగయ్యగౌడ్, అశోక్‌గౌడ్, వెంకట్‌రెడ్డి, బాలరెడ్డి, కిరణ్‌రెడ్డి, గోవర్ధన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
