ప్రతీ ఇంటికి చేరిన కూటమి ప్రభుత్వ సంక్షేమం
అవనిగడ్డ 7వ వార్డులో ఇంటింటికీ తెలుగుదేశం
అవనిగడ్డ – ఆంధ్రప్రభ : అవనిగడ్డ పట్టణంలోని 7వ వార్డులో శుక్రవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో “ఇంటింటికీ తెలుగుదేశం” కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, మహిళా సాధికారత కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన కార్యక్రమాలు, పెన్షన్లు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాల గురించి వివరించారు. అలాగే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ, ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు. పార్టీ కార్యకర్తలు ప్రజలతో మమేకమై ప్రభుత్వ విజయాలను విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
