ట్రాఫిక్ పోలీసులకు రెయిన్ కోట్ లు పంపిణీ
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ: స్థానిక ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి టీడీపీ ఇబ్రహీంపట్నం మండల క్లస్టర్ ఇన్ చార్జి, తెలుగు యువత సెక్రటరీ గరికపాటి శివ గురువారం రెయిన్ కోట్ లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో ఉచితంగా ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చి ఎంతో మంది ప్రాణాలు కాపాడినట్లు చెప్పారు. అలాగే వలస కార్మికులకు అన్నదానం చేశామన్నారు. రానున్న కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఆర్ఐ కృష్ణ పాల్గొన్నారు.
