మంత్రి పయ్యావులను కలిసిన టీడీపీ నాయకులు
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ: విజయవాడలోని సచివాలయంలో, మంత్రి క్యాంప్ కార్యాలయంలో గురువారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ను ఉరవకొండ నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా ఉరవకొండ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలలో అభివృద్ధి పనులు, పెన్నహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి నూతన రథోత్సవం, పెన్నహోబిలం అభివృద్ధి పనుల గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో పెన్నాహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ధర్మకర్తల
మండలి చైర్మన్ రేగటి నాగరాజు, ఉరవకొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ విజయ భాస్కర్, ఉరవకొండ మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ మోపిడి గోవిందు, మాజీ ఎంపీపీ దాసరి ప్రతాప్ నాయుడు, టీడీపీ నాయకులు ఎర్రి స్వామి నాయుడు, లాయర్ శ్రీనివాసులు, రాజశేఖర్, చాబాల ఎర్రిస్వామి పాల్గొన్నారు.
