ఆర్టీసీ డిపో ఎదుట కార్మికుల ఆందోళన

సమస్యల పరిష్కారానికి జేఏసీ డిమాండ్

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ: ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో రెండో రోజు బుధవారం ఉరవకొండ ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు. ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ నాయకులు మాట్లాడుతూ పినాకిల్ కంపెనీతో ఒప్పందాలను విరమించుకోవాలని కోరారు. పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయడంతో పాటు ఐఆర్‌ను ప్రకటించాలని, పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

అలాగే స్త్రీ శక్తి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని, కొత్తగా 4 వేల బస్సులను ప్రవేశపెట్టాలని, 15 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు నారాయణస్వామి, వెంకటేశులు, బళ్లారి మాబు సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.