రాజేష్ విమర్శలకు నైతిక హక్కు లేదు

తప్పుడు ఆరోపణలపై పరువునష్టం దావా వేస్తా: బీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు శ్రావణ్

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : బ్లూఫిలింల కేసులో నిందితుడిగా ఉన్న, మహిళలను ఎరచూపి ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను మోసం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ నేత కుంబాల రాజేష్‌కు తనను విమర్శించే నైతిక హక్కు లేదని బీఆర్‌ఎస్‌వీ జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్ అన్నారు.

బెల్లంపల్లి ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనపై సత్యదూరమైన ఆరోపణలు చేస్తున్న కుంబాల రాజేష్ తన గత చరిత్రను గుర్తు చేసుకోవాలని అన్నారు.

హైదరాబాద్‌లో ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఏజెన్సీ నిర్వహిస్తూ ఇంజనీరింగ్ అడ్మిషన్లు ఇప్పించే పనులు చేశానని, ఎవరి వద్ద నుంచి అక్రమంగా డబ్బులు తీసుకోలేదని శ్రావణ్ తెలిపారు.

బ్రోకర్ దందాలు చేస్తూ అమాయకులను మోసం చేసిన వ్యక్తి తనపై అర్థరహిత ఆరోపణలు చేయడం అనైతికమని విమర్శించారు.

కుంబాల రాజేష్ చేసిన ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు. తనపై చేసిన తప్పుడు ఆరోపణలపై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు.

బీఆర్‌ఎస్ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడిగా అనేక మంది పేద విద్యార్థులకు విద్యాసంస్థల్లో అడ్మిషన్లు ఇప్పించి వారి భవిష్యత్తుకు తోడ్పడ్డానని తెలిపారు.

కుంబాల రాజేష్ చరిత్ర, వ్యవహారాలకు సంబంధించిన వివరాలను వారానికి ఒకసారి బులెటిన్ రూపంలో ప్రజల ముందుకు తీసుకువస్తానని అన్నారు.

ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ యువజన విభాగం నాయకుడు సబ్బని అరుణ్ కుమార్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు ఎరుకల సుందర్ రావు, రేవెల్లి విజయ్ కుమార్, సుమంత్, మహేందర్, వెంకటేష్, నవీన్, కృష్ణంరాజు, హర్షవర్ధన్, సాయి తదితరులు పాల్గొన్నారు.