ఆచార్య ఆశయాలు స్ఫూర్తిదాయకం
పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో నివాళి
పెద్దపల్లి రూరల్: పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో గురువారం తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య ఆచార్య జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆచార్య జయశంకర్ జీవితాంతం కృషి చేశారని, ఆయన ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, టౌన్ ప్లానింగ్ అధికారి నరేష్, సీనియర్ అసిస్టెంట్ శ్రీశైలం, అకౌంటెంట్ నాగమణి, జూనియర్ అసిస్టెంట్లు జనార్దన్, రమాకాంత్, సురేందర్, వార్డు అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
