ప్రహరీ గోడ కూలి వృద్ధురాలి దుర్మరణం

హనుమకొండ, ఆంధ్రప్రభ: హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నెలు గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లక్ష్మీకాంతమ్మ (70) అనే వృద్ధురాలు ప్రహరీ గోడ కూలిపడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టినా అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనను పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రహరీ గోడ కూలిపోవడానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టగా, ఈ ఘటనతో పున్నెలు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.