సీతగొంది దేవస్థానం అభివృద్ధికి నిధులు ఇవ్వాలి
- మంత్రి సీతక్కకు ఆత్రం వంశీయుల వినతి
సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు) మండలం పంగిడి పంచాయతీ పరిధిలోని సీతగొంది ఆత్రం వంశీయుల దేవస్థానం అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కను కోరారు. బుధవారం హైదరాబాద్లోని ప్రజాభవన్లో మంత్రిని కలిసి పంగిడి సర్పంచ్ ఆత్రం మీరజాలింషా వినతిపత్రం సమర్పించారు.
దేవస్థానానికి వచ్చే భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పన కోసం మంచినీటి వసతి, సీసీ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. దేవస్థానం అభివృద్ధితో భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందడంతో పాటు ఈ ప్రాంతానికి మరింత గుర్తింపు లభిస్తుందని వినతిపత్రంలో పేర్కొన్నారు. మంత్రి సీతక్కను కలిసిన వారిలో సిర్పూర్ (యు) మాజీ ఎంపీపీ ఆత్రం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
