రోగులకు కొండంత దీపం సీఎంఆర్ఎఫ్..
- సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు
పాయకాపురం, ఆంధ్రప్రభ : అకస్మాత్తుగా వచ్చే అనారోగ్యం వలన వైద్య పరీక్షలకు తగినంత ఆర్ధిక స్థోమత లేకపోతే అటువంటి వారికి కొండంత దీపంగా ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్)ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. సింగ్ నగర్ ప్రాంతంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తులు చేసుకొన్న 11 మంది బాధితులకు సుమారు7.53 లక్షల నగదు చెక్కులను టీడీపీ శ్రేణులు సమక్షంలో బొండా ఉమామహేశ్వరరావు అందజేశారు.
పేద, మధ్యతరగతి కుటుంబాలకు అత్యవసర సమయంలో ఈ పథకం ప్రాణాధారంగా నిలుస్తోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్, మాజీ కార్పొరేటర్ ఎరుబోతు శ్రావణి, క్లస్టర్ ఇంచార్జ్ వింజమూరి సతీష్, 59వ డివిజన్ అధ్యక్షులు రాజన బంగారు నాయుడు, ప్రధాన కార్యదర్శి బుదాల సురేష్,ఎస్. కె.గౌసియా, 58వ డివిజన్ అధ్యక్షులు కూర్మాపు దుర్గారావు, ఇంచార్జ్ పిరియ సోమేశ్వరరావు, దొండపాటి సుల్తానా,అమర్నాథ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
