వేద పరిరక్షణ, అన్నదానానికి విరాళాలు..

  • అధికారులను కలిసి విరాళాలు అందజేసిన దాతలు

( ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ ) : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి చెందిన వేద పరిరక్షణ ట్రస్ట్కు హైదరాబాద్‌లోని ఉప్పల్‌కు చెందిన జి.బి. శాస్త్రి, ప్రశాంతి దంపతులు,లక్ష్మీ నాగ అపరాజిత పేరుతో రూ.1,00,000 విరాళం అందజేశారు. దేవస్థాన అధికారులను కలిసి భక్తిశ్రద్ధలతో విరాళం సమర్పించిన దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేయగా వేద ఆశీర్వచనం అనంతరం ప్రధానాలయ సూపర్డెంట్ నాగేశ్వరరావు, ఇన్స్పెక్టర్ జగన్ లో అమ్మవారి చిత్రపటం ప్రసాదాలు రసీదు అందజేశారు.

అన్నదానానికి రూ.1,01,116 విరాళం..

శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన పథకానికి విజయవాడ విద్యాధరపురానికి చెందిన పి. యుగంధర్ దంపతులు, వారి కుటుంబ సభ్యులు రూ.1,01,116 విరాళం అందజేశారు. దేవస్థానం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కిషోర్ కుమార్ ను కలిసి భక్తిశ్రద్ధలతో విరాళం సమర్పించారు. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు అమ్మవారి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయగా వేద ఆశీర్వచనం అనంతరం అమ్మవారి చిత్రపటం ప్రసాదాలు రసీదు అందజేశారు.