రాహుల్ గాంధీని కలిసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
కుమార్తె వివాహానికి ఆహ్వానించిన ఎమ్మెల్యే
జుక్కల్, ఆంధ్రప్రభ: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు తన కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం న్యూఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా తన జ్యేష్ఠ కుమార్తె జొనిట వివాహ ఆహ్వాన పత్రికను రాహుల్ గాంధీకి అందజేసి, వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించాలని ఆహ్వానించారు.
ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆహ్వానాన్ని రాహుల్ గాంధీ సాదరంగా స్వీకరించారు. ముందస్తుగా నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి దాంపత్య జీవితం ఆనందంగా, ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో కళకళలాడాలని ఆకాంక్షించారు.
రాహుల్ గాంధీని కలిసిన వారిలో ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు, ఆయన సతీమణి తోట అర్చన, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
