ప్రణాళిక ప్రకారమే నిధుల వ్యయం చేయాలి
జీపీడీపీలో పొందుపరిచిన పనులనే చేపట్టాలని ఎంపీవో సూచన
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలంలోని బాబాపూర్ గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ)లో పొందుపరిచిన పనులనే క్షేత్రస్థాయిలో అమలు చేయాలని ఇన్చార్జి ఎంపీవో యూసఫ్ ఖాన్ సూచించారు.
మంగళవారం బాబాపూర్ సర్పంచ్ ఎం.ఏ. సమీర్, ఉప సర్పంచ్ మంద గోవర్ధన్‌కు నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు.
16వ ఆర్థిక సంఘం నిధుల వినియోగం, జీపీడీపీ యాక్షన్ ప్లాన్ తయారీపై సర్పంచ్, ఉప సర్పంచ్‌కు అవగాహన కల్పించారు. ప్రణాళిక ప్రకారమే నిధులను ఖర్చు చేయాలని సూచించారు.
జీపీడీపీలో లేని పనులను చేపడితే భవిష్యత్తులో బిల్లుల చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. నిబంధనలకు అనుగుణంగా పనులు చేపట్టి గ్రామాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సంతోష్, కారోబార్ ఇమ్రాన్, శివ తదితరులు పాల్గొన్నారు.
