హామీ ఇచ్చారు… నెరవేర్చారు

హామీ ఇచ్చారు… నెరవేర్చారు
- గ్రామ ప్రజల ప్రశంసలు అందుకుంటున్న సర్పంచ్ గంగారెడ్డి
కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ: పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామ సర్పంచ్ నలిమేల రేవతి గంగారెడ్డి ఇచ్చిన హామీనీ నెరవేర్చి గ్రామ ప్రజల ప్రశంసలు అందుకున్నారు. శుక్రవారం గ్రామ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గ్రామంలో ఆడపిల్ల జన్మిస్తే రూ. 5,000 కానుక అందజేస్తాననీ ఇచ్చిన హామీ మేరకు, నలుగురు ఆడపిల్లలకు తన సొంత డబ్బులతో పోస్ట్ ఆఫీస్ లో ఖాత తెరిచి వారి పేర్లపై ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వారి కుటుంబ సభ్యులకు ఖాతాలను అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ గంగారెడ్డి మాట్లాడుతూ.. సర్పంచ్ గా తన పదవీ కాలంలో ఉన్నన్ని రోజుల్లో గ్రామంలో ఆడపిల్ల జన్మిస్తే రూ.5,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఎంసి చైర్మన్ పాలెపు నర్సయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికలలో హామీలు ఎన్నో ఇస్తారు కానీ.. తన డబ్బులతో ఇచ్చిన హామీనీ నెరవేర్చి మాట నిలబెట్టుకున్న సర్పంచ్ గంగారెడ్డిని అభినందించారు. ఆడపిల్లల కుటుంబ సభ్యులు సర్పంచ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఏనుగు మనోహర్, సెక్రెటరీ నవీన్, పాలక వర్గం సభ్యులు, విడిసి సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
