ఎన్‌హెచ్-163పై రోడ్డు భద్రతా పనులు వేగవంతం చేయాలి
అండర్‌పాస్‌లు, సర్వీస్ రోడ్ల ఏర్పాటుకు ఎన్హెచ్ఏఐ అధికారికి ఎమ్మెల్యే కుంభం వినతి
వలిగొండ, ఆంధ్రప్రభ : భువనగిరి నియోజకవర్గ పరిధిలోని ఎన్‌హెచ్-163 జాతీయ రహదారిపై రోడ్డు భద్రతా పనులను త్వరితగతిన చేపట్టాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఎన్హెచ్ఏఐ చీఫ్ జనరల్ మేనేజర్ (టెక్నికల్) & రీజినల్ ఆఫీసర్ శివశంకర్‌ను హైదరాబాద్‌లోని కార్యాలయంలో కలిసి విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా సింగన్నగూడెం క్రాస్ రోడ్, రామకృష్ణాపురం గ్రామ క్రాస్ రోడ్, అనంతారం గ్రామ క్రాస్ రోడ్ వద్ద అండర్‌పాస్‌లు, సర్వీస్ రోడ్లను ఏర్పాటు చేయాలని కోరారు.
ఈ ప్రాంతాల్లో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రతిపాదిత పనులకు అవసరమైన అనుమతులు మంజూరు చేసి, ప్రాధాన్యత ప్రాతిపదికన త్వరితగతిన పనులు ప్రారంభించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
రోడ్డు భద్రతకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని ఆయన పేర్కొన్నారు.
