విద్యార్ధులు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి: కె.వి.ఆర్
శావల్యాపురం, ఆంధ్రప్రభ : విద్యార్థులు మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని శ్రీరామ పాఠశాల కరస్పాండెంట్ కె.వి.ఆర్ మోహన్ చంద్ అన్నారు. మండల కేంద్రమైన శావల్యాపురం శ్రీరామ పాఠశాల నందు మంగళవారం గ్రీన్ కలర్ డే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఆకుపచ్చ రంగు యొక్క ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించేందుకు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి తరగతి గదులను పాఠశాల ఆవరణను పచ్చని కూరగాయలు, పండ్లు, మొక్కలతో అందంగా అలంకరించారు.
ఆకుపచ్చని రంగుకు ప్రకృతిలో ఉన్న అనుబంధాన్ని విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ కె.వి.ఆర్ మాట్లాడుతూ ప్రకృతిని, పచ్చదనాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత విద్యార్థుల ముందున్న కర్తవ్యమన్నారు. ఆకుపచ్చని రంగుకు ప్రకృతికి అనుబంధం ఉందని ప్రతి విద్యార్థి మొక్కలు నాటి సంరక్షణ చేయాలని చెప్పారు. మనం తినే ఆహార పదార్థాలు ఆకుపచ్చని పదార్థాల్లో శరీరానికి కావలసిన విటమిన్లు ప్రోటీన్లు ఎక్కువగా లభిస్తాయని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె.రత్నకుమారి, తదితరులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
