ఘనంగా శత జయంతి వేడుకలు..
ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : అరుదైన వ్యక్తిత్వం మండలి వెంకట కృష్ణారావు సొంతమని ప్రధానోపాధ్యాయిని బి.హేమలత అన్నారు. కొండపల్లి జడ్పీ బాలికల హైస్కూల్ ప్లస్ లో మంగళవారం మండలి వెంకట కృష్ణారావు శత జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఆయన జీవిత విశేషాలను హెచ్ఎం విద్యార్థులకు వివరించారు. మహనీయుల జీవిత గాధలు తెలుసుకోవడం, వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవడం విద్యార్థులకు ఎంతో అవసరమన్నారు. 1977 నాటి దివిసీమ ఉప్పెనలో కృష్ణారావు సేవలను కొనియాడారు. తొలుత మండలి చిత్రపటం వద్ద అంజలి ఘటించారు. కార్యక్రమంలో పీజీ టీచర్ ఝాన్సీరాణి, వనజాక్షి, లక్ష్మీ సుహాసిని, కామేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
