కాలేజీ విద్యార్థులు మజ్జిగ పంపిణీ…

కాలేజీ విద్యార్థులు మజ్జిగ పంపిణీ…
పాయకాపురం, ఆంధ్రప్రభ : స్థానిక పైపుల రోడ్డు, సింగ్ నగర్లో గల ఆదిత్య డిగ్రీ కళాశాల ఎన్.ఎస్.ఎస్ విద్యార్థులచే ఉచితంగా వాహనచోదకులకు, పాదచారులకు ఆదివారం మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జగదీశ్వరి పాల్గొని మాట్లాడుతూ పెరుగుతున్న ఎండలకు ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ముఖ్యంగా వడ దెబ్బ తగల కుండా తరుచూ మంచినీటిని తాగాలని, కాటన్ దుస్తులు ధరించాలని ఆమె పేర్కొన్నారు. ఇంటి బయట నుంచి రాగానే మధ్యాహ్నం సమయంలో వెంటనే ముఖం కడుకోవడం చేయ కూడదని సూచించారు. ఈకార్యక్రమంలో ఎన్.ఎస్.ఎస్.ఏపీ.ఓ. హేమంత్, విద్యార్థులు, కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు.
