సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీ పత్రాల అందజేత

సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీ పత్రాల అందజేత
భవానిపురం, ఆంధ్రప్రభ : మెరుగైన వైద్యం కోసం ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా మంజూరైన ఎల్ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) పత్రాలను ఎన్డీఏ కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి సౌజన్యంతో ఈ సహాయం మంజూరైనట్లు కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ తెలిపారు.
51వ డివిజన్ కొత్తపేటకు చెందిన వై. ఉదయ్ కుమార్ (32) రోడ్డు ప్రమాదంలో గాయపడి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెరుగైన వైద్యం కోసం దరఖాస్తు చేసుకోగా రూ.5 లక్షల ఎల్ఓసీ మంజూరైంది. అలాగే 49వ డివిజన్ జోడు బొమ్మల ప్రాంతానికి చెందిన డొంకాన గోపాలరావు (53) రోడ్డు ప్రమాదంలో గాయపడగా, అతనికి రూ.4 లక్షల 72 వేల ఎల్ఓసీ మంజూరైంది.
ఈ పత్రాలను బాధితుల కుటుంబ సభ్యులకు అందజేశారు. త్వరితగతిన స్పందించి సహాయం అందించడంతో కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే సుజనా చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్, దుర్గమ్మ గుడి ట్రస్ట్ బోర్డు సభ్యుడు అవ్వారు బుల్లబ్బాయి, ఏపీ నగరాల కార్పొరేషన్ డైరెక్టర్ కరణం దివాకర్ బాబు, బీజేపీ ఎన్టీఆర్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ నున్న కృష్ణ, బీజేపీ సీనియర్ నాయకులు వడ్లాని మాధవరావు, దుర్బేసుల హుస్సేన్, వాణిజ్య విభాగం కన్వీనర్ పచ్చిపులుసు వెంకట శివప్రసాద్, అధికార ప్రతినిధి గన్నవరపు శ్రీనివాసరావు, జనసేన నాయకులు ఏలూరు సాయి శరత్, శనివారపు శివ, బీజేపీ డివిజన్ అధ్యక్షులు రుద్రపాటి వెంకటేష్, బెన్నా భక్తుల సోమేశ్వరరావు, తెలుగు యువత నాయకులు దాడి మురళి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
