అధికార్లు ఇసుకను పట్టించుకోకండి..
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్..
జన్నారం, ఆంధ్రప్రభ : అటవీ అధికారులు ఇసుకను పట్టించుకోకండని,ఈ వ్యవహారంలో చూసి చూడనట్టు వ్యవహరించాలని నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సూచించారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో మండల గ్రామ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం మంగళవారం సాయంత్రం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అటవీ శాఖలో ఓ అధికారి వల్ల కిందిస్థాయి ఉద్యోగులు అత్యుత్సాహం చూపిస్తున్నారన్నారు.

ఈ విషయమై జన్నారం ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ బాబా ఖాదర్ వలీ సమాధానం ఇస్తూ, టైగర్ జోన్ లో ఏకో సెన్సిటీవ్ జోన్ పరిధిని 10 నుంచి ఒక కిలోమీటర్లు తగ్గించాలని ఆదేశాలు వస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. కామన పల్లి సర్పంచి పేరం శ్రీనివాస్ మాట్లాడుతూ.. నీటిపారుదల శాఖ 30 ఎకరాల భూమి కొందరు ఆక్రమించుకొని అనుభవిస్తున్నారన్నారు.
జన్నారం, కొత్తపేట, కవ్వాల, ఇందనపల్లి, చింతగూడ, వెంకటాపూర్ సర్పంచులు అజ్మీర కళావతి-నందునాయక్, దినేష్, సక్రునాయక్, శంకర్, సుమలత, రాజకుమార్ మాట్లాడుతూ… గ్రామాలలో విద్యుత్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ఆరోపించారు. విద్య, వైద్యం, ఆరోగ్య, గృహ నిర్మాణ శాఖ, ఇతర శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో ఉమర్ షరీఫ్, తాహసిల్దార్ బక్కయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీనారాయణ, పొనకల్ సింగిల్ విండో చైర్మన్ అల్లం రవి, ఎంఈఓ రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.
