తైపీ ఓపెన్ ఫైనల్లో తన్వీ శర్మ.. తొలి బీడబ్ల్యూఎఫ్ టైటిల్‌పై గురి

ఆంధ్రప్రభ : భారత యువ బ్యాడ్మింటన్ సంచలనం తన్వీ శర్మ తన తొలి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్ లక్ష్యంగా ఆదివారం జరిగే తైపీ ఓపెన్–2026 మహిళల సింగిల్స్ ఫైనల్‌లో వియత్నాంకు చెందిన న్గుయెన్ థుయ్ లిన్తో తలపడనుంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 34వ స్థానంలో ఉన్న తన్వీ శర్మ సెమీఫైనల్లో తైవాన్ క్రీడాకారిణి హువాంగ్ యు-హ్సున్పై వరుస గేమ్‌ల్లో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. మరో సెమీఫైనల్లో న్గుయెన్ థుయ్ లిన్ భారత క్రీడాకారిణి ఉన్నతి హుడాను ఓడించి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇది తన్వీ శర్మకు రెండో సూపర్-300 ఫైనల్ కాగా, తొలి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్‌ను అందుకోవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది.

ప్రత్యక్ష ప్రసారం వివరాలు..
మ్యాచ్ ఆదివారం ఉదయం 9:30 గంటలకు (భారత కాలమానం) ప్రారంభం కానుండ‌గా.. BWF TV యూట్యూబ్ ఛానల్ లైవ్ స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉంటుంది