ఘనంగా తమ్మినేని మాధురి జన్మదిన వేడుకలు..

ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : కొండపల్లి పట్టణ బీజేపీ అధ్యక్షురాలు తమ్మినేని మాధురిని పార్టీ నాయకులు శనివారం ఘనంగా సత్కరించారు. ఆమె జన్మదినాన్ని పురస్కరించుకుని కొండపల్లి బీజేపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నేత నూతులపాటి బాలకోటేశ్వరరావు (బాల) మాట్లాడుతూ, తమ్మినేని మాధురి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందిస్తూ రాజకీయంగా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో యుగంధర్, మల్లేశ్వరరావు, తిరుపతి నాయుడు, బెనర్జీ, పార్థసారథి, నరసింహారావుతో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.