ఆగస్టు 7న చీరాలకు సీఎం చంద్రబాబు..

(బాపట్ల బ్యూరో, ఆంధ్రప్రభ ) : జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆగస్టు 7న చీరాలలో నిర్వహించే రాష్ట్ర స్థాయి వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. చేనేత కార్మికులను ఉద్దేశించి ప్రసంగించడంతో పాటు, చేనేత రంగాభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలను ప్రారంభించే అవకాశం ఉంది. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. భద్రత, ట్రాఫిక్, వేదిక, ప్రజా సౌకర్యాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లను వేగవంతం చేస్తున్నారు.