విద్యార్థులను ప్రోత్సహించేందుకే విద్యాచక్రం..
ఎమ్మెల్యే అమిలినేని
రూ.5కోట్ల ఖర్చుతో 7300 సైకిళ్లు పంపిణీ
కళ్యాణదుర్గం, జులై 31 (ఆంధ్రప్రభ) : విద్యార్థుల భవిష్యత్తుకు తోడుగా ఉండి విద్యకు ప్రాధాన్యత కల్పించి వారికి మరింత ప్రోత్సాహం అందించడం కోసం సరైన రవాణా సౌకర్యం లేక పాఠశాలలకు నడుచుకుంటూ వెళ్తున్న గ్రామీణ ప్రాంతాల 9,10 తరగతి, ఇంటర్ విద్యార్థులకు కానుకగా సైకిళ్లు అందిస్తున్నామని గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి మధ్యాహ్న భోజనం పేరును కూడా జగన్ పేరుపేట్టుకుని, చివరికి గుడ్డు, గరిట, జగ్గుపై బొమ్మలు వేయించుకోవడమే కాకుండా పిల్లలకు ఇచ్చే బ్యాగు, పుస్తకాలు, బెల్టు, టై పై కూడా బొమ్మలు వేసుకుని రాజకీయం చేసాడని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు పేర్కొన్నారు. నాలుగవ రోజు గ్రామీణ విద్యార్థులకు ప్రోత్సాహక కానుకగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు అందిస్తున్న సైకిళ్ల పంపిణీ బ్రహ్మసముద్రం మండలం గుండిగానిపల్లి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించగా… టీడీపీ మండల, స్థానిక నాయకులు ఎమ్ ఈ ఓలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందంతో కలసి పాల్గొని సైకిళ్లు విద్యార్థులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో అందజేశారు..
ఈసందర్బంగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు మాట్లాడుతూ… గత వైసీపీ ప్రభుత్వంలో అందరికి అమ్మవడి అని చెప్పి తీరా అందించే సమయానికి ఒక్క ఇంట్లో ఒక్కరికే ఇచ్చి వారి చదువులను తుంగలో తొక్కాడన్నారు. కేవలం అమ్మవడి పథకం ద్వారా కేవలం రూ.5500 కోట్లు అందించారని, కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు తల్లిదండ్రుల బాధలు తెలుసుకుని అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంట్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్ చదివే విద్యార్థులు ఎంతమంది ఉంటే అందరికి తల్లికివందనం అందిస్తామని హామీ ఇచ్చి ప్రస్తుతం10,190 కోట్లు కేటాయించి ప్రతి తల్లి ఖాతాకు జమ చేసి నిబద్దత చాటుకున్నారన్నారు. అందులో కూడా చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్న 30,000 మంది అంగన్వాడీ టీచర్లకు అందించి కూటమి ప్రభుత్వం గొప్ప మనసు చాటుకుందని తెలిపారు..అంతే కాకుండా గతంలో విద్యావ్యవస్థను నిర్లక్ష్యం చేసి ఉపాధ్యాయులను బ్రాంది షాపుల వద్ద ఉంచారన్నారు..

ఎన్నికల ముందు గ్రామాలకు వెళ్లిన సందర్భంలో చాలా చోట్ల విద్యార్థులు పుస్తకాల బ్యాగులు మోసుకుని నడుచుకుంటూ రావడం చూసి బాధ కలిగి అనాడే అనుకున్నా విద్యార్థులకు ఏదో ఒక రకంగా వారి ఇబ్బందులు తొలగించాలని నిర్ణయించుకున్నానని నేడు వారికి సైకిళ్లు అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు..ప్రతి విద్యార్థి భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని, వారికి అనవసరపు పనులకు కేటాయించకుండా చదువుకునేందుకు ఎక్కువ సమయం కేటాయించి వారి బంగారు భవిష్యత్తుకు బాసటగా నిలవాలన్నారు. మోడీ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ దేశ విదేశాలు తిరిగి లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారన్నారు.
మన ప్రాంతంలో ఎంతో మంది ఉన్నత చదువులు చదివి ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారని, తిమ్మసముద్రం ప్రాంతంలో ఇప్పటికే ఉన్న 1200 ఎకరాలను మరో 3000 ఎకరాలు భూమి తీసుకుని రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేయబోతున్నారని తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని అంతే కాకుండా ఈ ప్రాంథంలో భూములు ధరలు పెరుగుతాయన్నారు.
బీటీపీ పనులు ఆలస్యం కావడానికి కారణం భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వడంలో నిర్లక్ష్యం కారణంగా ఆలస్యం అయిందని, దాదాపు 15నెలల కాలంలో ప్రతి ఎకరాను గుర్తించి పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి పంపామని, త్వరలోనే వారికి పరిహారం అందిస్తామని, ముఖ్యమంత్రి ఇప్పటికే ఇరిగేషన్ క్యాలెండర్ విడుదల చేసి 2028 నాటికి బీటీపీ పూర్తిచేసేలా ప్రకటించారని తెలిపారు.. కుందుర్పి మండలం వెంకటంపల్లి గ్రామం నుంచి నిజవల్లి గ్రామానికి రోడ్డు వేయించమని ఒక ఇంటర్ అమ్మాయి ఏడ్చి అడిగిందని వెంటనే ఎస్సార్సీ సభ్యులను పిలిచి సమస్య పరిష్కరించాలని సూచించగా ఒక నెలలోపు బస్సులు నడిచేలా రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చానన్నారు.
