పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు: బీఆర్ఎస్ నేతలు

చిట్యాల, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అవిశ్రాంతంగా పనిచేసిన ఉద్యమవీరుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, మాజీ తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి తెలంగాణ సమాజానికి, బీఆర్ఎస్ పార్టీకి, ఉద్యమ సహచరులకు తీరని లోటని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అల్లం రవీందర్ అన్నారు. శుక్రవారం చిట్యాల మండల కేంద్రంలో నిర్వహించిన నివాళి కార్యక్రమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాల పాటు మౌనం పాటించి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు.

తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన సేవలు, ప్రజల పట్ల చూపిన అంకితభావం, పార్టీ బలోపేతానికి అందించిన నాయకత్వం చిరస్మరణీయమని నాయకులు కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఆయన చేసిన త్యాగాలు, పోరాట పటిమ, ఉద్యమ స్ఫూర్తి భావితరాలకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అల్లం రవీందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్ట సురేష్ బాబు, మండల యువజన అధ్యక్షుడు తౌటం నవీన్, టౌన్ అధ్యక్షుడు బుర్ర శ్రీధర్ గౌడ్, సీనియర్ నాయకులు బైరం భద్రయ్య, బుర్ర రఘు గౌడ్, జెట్టి కుమార్, లాండే శివాజీ, చిదిరాల కోటి, మేడిపల్లి శ్రీనివాస్, మర్రి నరేష్, మూసాపురి రవీందర్, చేరి రవీందర్, తాటిపల్లి శ్రీనివాస్, ఏలేటి రాజు, మూసాపురి రమేష్, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.