సంపూర్ణ గోవధ నిషేధ చట్టం తీసుకురండి..!

గోవును జాతీయ జంతువుగా ప్రకటించండి..!!

పెద్దపల్లి రూరల్: గోసన్మాన్–గోవన్ అభియాన్‌లో భాగంగా సంపూర్ణ గోవధ నిషేధ చట్టం తీసుకురావడంతో పాటు గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతూ హిందూ సంఘాల నాయకులు శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లో ఏఓ ప్రకాశ్‌కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా కేంద్రంలో గోవుల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, గోగ్రాస బోర్డు ఏర్పాటు చేయడంతో పాటు గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని కోరారు. దేశీయ గోవు ప్రాముఖ్యతను విద్యా పాఠ్యాంశాల్లో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో హిందూ సంఘాల నాయకులు నాగులమల్యాల సత్యం, జంజీపెల్లి దిలీప్, బొమ్మకంటి రవి, గుండా సతీష్, అడిచర్ల ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.