వికాస్ పాఠశాలలో ఘనంగా ‘రెయినీ డే’ వేడుకలు

తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ: తొర్రూరు డివిజన్ కేంద్రంలోని వికాస్ పాఠశాలలో శుక్రవారం ‘రెయినీ డే’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు వర్షాకాలంలో ఉపయోగించే రెయిన్‌కోట్లు, గొడుగులతో పాటు రంగురంగుల దుస్తులు ధరించి కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ తాళ్లపల్లి రమేష్, డైరెక్టర్ కె.వి. రెడ్డి మాట్లాడుతూ వర్షాకాలంలో గొడుగులు, రెయిన్‌కోట్లు ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. అలాగే నీటి నిల్వల వల్ల దోమలు, ఈగలు పెరిగి వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిస్తే రైతులకు, ప్రజలకు మేలు జరుగుతుందని, రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని వారు అన్నారు. వర్షాకాలంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆరోగ్య పరిరక్షణ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ వేణుమాధవ్, వైస్ ప్రిన్సిపాల్ లింగమూర్తి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.