పెద్ది మరణం బాధాకరం

ఉద్యమ నాయకులు దిండి గల రాజేందర్

ఇల్లెందు, ఆంధ్రప్రభ : నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతి అత్యంత బాధాకరమని తెలంగాణ ఉద్యమ నాయకుడు దిండిగల రాజేందర్ అన్నారు. ఆయన మృతికి నివాళులర్పిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్థాపించిన పార్టీ పట్ల విధేయుడిగా ఉంటూ అంచెలంచెలుగా ఎదిగి ప్రజానాయకుడిగా గుర్తింపు పొందిన పెద్ది సుదర్శన్‌రెడ్డి మరణం తీరని లోటని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్రను ఈ సందర్భంగా దిండిగల రాజేందర్ స్మరించుకున్నారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి భౌతికంగా దూరమైనప్పటికీ, తెలంగాణ పట్ల ఆయనకున్న అంకితభావం, ఆలోచనలు ఎప్పటికీ సజీవంగానే ఉంటాయని అన్నారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి పార్టీతో పాటు ప్రజలు కూడా ఎల్లప్పుడూ అండగా ఉంటారని దిండిగల రాజేందర్ భరోసా ఇచ్చారు.