కనకదుర్గమ్మకు రూ.2.25 లక్షల విరాళం..
ఆలయ అభివృద్ధి, ఉచిత ప్రసాద పంపిణీ కోసం
( ఇంద్రకీలాద్రి ఆంధ్రప్రభ ) : ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధి, ఉచిత ప్రసాద పంపిణీ కోసం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఏఎస్‌ఆర్ నగర్‌కు చెందిన వెంకట దుర్గా శిరీష రూ.2,25,000 విరాళాన్ని దేవస్థానానికి సమర్పించారు. గురువారం ఆలయ అధికారులను కలిసి విరాళాన్ని అందజేయగా… అధికారులు వీరికి అమ్మవారి దర్శనం ఏర్పాట్లు చేశారు. వేద ఆశీర్వచన మంత్రం ప్రధానాలయ సూపరిండెంట్ నాగేశ్వరరావు దాతకు అమ్మవారి చిత్రపటం ప్రసాదాలు రసీదును అందజేశారు.
